Namaste NRI

చంద్రముఖి-2.. రాఘవ లారెన్స్‌ ఫస్ట్‌ లుక్‌

రాఘవ లారెన్స్‌ హీరోగా నటిస్తున్న చిత్రం చంద్రముఖి-2. కంగనా రనౌత్‌ కథానాయిక.  పి.వాసు దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. రజనీకాంత్‌ నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వడివేలు, లక్ష్మీమీనన్‌, మహిమా నంబియార్‌, రాధికా శరత్‌కుమార్‌, విఘ్నేష్‌ తదితరులు నటిస్తున్నారు.   ఈ సినిమాలో రాఘవ లారెన్స్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో రాజు వేషంలో రాజసం, పొగరుతో పాటు క్రూరత్వం కలబోసిన పాత్రలో ఆయన కనిపిస్తున్నారు. చంద్రముఖి చిత్రం హారర్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అదే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. లారెన్స్‌ పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది. హారర్‌తో పాటు వినోదం కూడా ఉంటుంది చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.డి.రాజశేఖర్‌, ఆర్ట్‌: తోట తరణి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, దర్శకత్వం: పి.వాసు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events