రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ చంద్రముఖి 2. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. ఆదివారం చిత్ర యూనిట్ చంద్రముఖి 2 ట్రైలర్ విడుదల చేసింది. ట్రైలర్‌లో రాఘవ లారెన్స్ రెండు షేడ్స్‌లో మెప్పిస్తున్నారు. ఒకటి స్టైలిష్ లుక్ కాగా, మరోటి వేట్టయా రాజా లుక్. ఇక చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ ఒదిగిపోయింది. ఇక బసవయ్య పాత్రలో స్టార్ కమెడియన్ వడివేలు తనదైన కామెడీతో మెప్పించబోతున్నారు. సినిమాలోని హారర్, థ్రిల్లింగ్, కామెడీ అంశాలను చూపించారు. ప్రతీ ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా తెరకెక్కించారు.
నటీనటుల పెర్ఫామెన్స్‌తో పాటు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం, నేపథ్య సంగీతం, ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా ఆడియెన్స్‌ను అలరించనున్నాయని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుతోంది. వినాయక చవితి సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 15న ఈ సినిమా విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో చంద్రముఖి 2 చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, వెంకట రత్నం శాఖమూరి రిలీజ్ చేస్తున్నారు.