Skip to main content

Namaste NRI

చంద్రయాన్ విలక్షణమైన కాన్సెప్ట్‌తో అందరినీ అలరిస్తుంది: శ్రీవిష్ణు

శివకుమార్‌ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్‌, లోకేష్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం చంద్రయాన్‌. ఈ చిత్రానికి శ్రీనాథ్‌ చంద్రశేఖర్‌ దర్శకుడు. చంద్రయాన్‌ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా కథలో ఓ సరదా పాయింట్‌ ఉంది. అందుకే వేణు ఊడుగుల టేకాఫ్‌ చేశారు. వినూత్న కథాంశంతో కొత్త టీమ్‌ చేసిన ప్రయత్నాన్ని మీరందరూ ప్రోత్సహించాలి అన్నారు.

ఆయుధాలు, రక్తపాతాలు లేని సినిమా ఇదని, జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా వాటన్నింటిని మర్చిపోయి రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకుంటారని, ఇదొక లాఫింగ్‌ థెరపీ అని దర్శకుడు శ్రీనాథ్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. వినూత్నమైన ఆలోచనతో రూపొందిన సినిమా ఇదని, అరుదుగా వచ్చే ఈ తరహా కథాంశాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నానని వేణు ఊడుగుల తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే సినిమా ఇదని చిత్ర నిర్మాత ప్రవీణ్‌ మొలక పేర్కొన్నారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events