Namaste NRI

పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ఎంపిక

పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ  పేరు ఖరారైంది. సీఎల్‌పీ భేటీలో ఎమ్మెల్యేలంతా తమ నాయకుడిగా చరణ్‌జిత్‌ను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. చరణ్‌జిత్‌తో పాటు కాంగ్రెస్‌ ప్రముఖులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేశారు. సీఎల్‌పీ నేతగా చరణ్‌జిత్‌ ఎన్నుకున్నట్లు తెలిపారు.  1973 ఏప్రిల్‌ 2న జన్మించిన చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ చౌమ్‌కౌర్‌ సాహిబ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్యెల్యేగా గెలిచారు. 2015`16 మధ్యకాలంలో అసెంబ్లీలో కాంగ్రెస్‌ తరపున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అమరీందర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. ఇతను రవి దాసియా సిక్కు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ముఖ్యమంత్రి చేపట్టబోతున్న తొలి దళితుడిగా గుర్తింపు పొందనున్నారు. చన్నీ ఎన్నిక వెనుక సిద్దూ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events