Namaste NRI

చార్లెస్‌ డార్విన్‌ ఆటోగ్రాఫ్‌ పేపర్‌.. వేలంలో రికార్డు ధర 

 ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్‌ డార్విన్‌ తన స్వహస్త్రాలతో రాసిన ఓ ప్రతి వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఈ పేపర్‌పై డార్విన్‌ పూర్తి పేరుతో సంతకం ఉంది. ఇలాంటి లేఖ అత్యంత అరుదుగా లభిస్తుంది. నేచురల్‌ సెలక్షన్‌ థియరీకి సంబంధించిన సమ్మేషన్‌ను ఈ ప్రతిలో రాశారు డార్విన్‌. దీంతో ఈ పేపర్‌ను ఓ ఓత్సాహికుడు రూ.7.2 కోట్లకు ( 8.82 లక్షల డాలర్లు) కొనుగోలు చేశాడు. డార్విన్‌ ఫుల్‌ ఆటోగ్రాఫ్‌తో కూడిన అత్యంత ముఖ్యమైన ప్రతి ఇదేనని నిర్వాహకులు తెలిపరు. వేలంలో ఇదే రికార్డు ధర అని పేర్కొన్నారు. 

Social Share Spread Message

Latest News