Skip to main content

Namaste NRI

అంగరంగ వైభవంగా పెండ్లి చేసిన చాట్‌జీపీటీ

చాట్‌జీపీటీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నది. పెండ్లి నిర్వహించే మతాధిపతిగా మారి అమెరికాలో నవ దంపతులను ఒక్కటి చేసింది. కొలరాడోలో రీలి అలిసన్‌ వించ్‌, డెటాయిన్‌ ట్రుయిట్‌ల వివాహానికి పెద్దలు నిశ్చయించారు. వినూత్నంగా ఉండాలని ఆలోచించిన ఆ జంట మతాధిపతికి బదులుగా తమ పెండ్లి చేసే బాధ్యతలను చాట్‌జీపీటీకి అప్పగించారు.  చాట్‌జీపీటీతో పని చేసే ఓ స్పీకర్‌ను రోబోకు అమర్చారు. దీంతో పెండ్లికి వచ్చిన వారిని ఆ చాట్‌జీపీటీ రోబో సాదరంగా ఆహ్వానించింది. అనంతరం వారి పెండ్లి తంతును అంగరంగ వైభవంగా జరిపించింది.

Social Share Spread Message

Latest News