క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవితం చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం చే. లాంగ్ లివ్ ట్యాగ్‌లైన్. బీఆర్ సబావత్ నాయక్ టైటిల్ రోల్‌ని పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్యబాబు, దేవేంద్ర నిర్మాతలు. దర్శకుడు, హీరో బీఆర్ సబావత్ నాయక్ మాట్లాడుతూ ప్రపంచ యువతకు స్ఫూర్తిదాయకమైన చేగువేరా బయోపిక్‌ను తెరకెక్కించడం చాలా ఆనందంగా ఉంది.ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలను ఈ సినిమాలో ఆవిష్కరించాం. వందకుపైగా థియేటర్లలో విడుదల చేయబోతున్నాం అ న్నారు. లావణ్య, సమీరా, పూల సిద్ధేశ్వర్ తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 15న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: కల్యాణ్ సమి, జగదీష్, సంగీతం: రవిశంకర్, రచయిత-దర్శకత్వం: బీఆర్ సబావత్ నాయక్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)