Skip to main content

Namaste NRI

సెన్సార్ పనులు ముగించుకున్న చెన్నై లవ్ స్టోరీ

కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం చెన్నై లవ్‌స్టోరీ. రవి నంబూరి దర్శకత్వం. ఈ చిత్రానికి ఎస్‌కేఎన్‌, సాయిరాజేష్‌ నిర్మాతలు. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. యు.ఏ సర్టిఫికెట్‌ లభించింది. ఇటీవల వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో ఇది విభిన్నంగా ఉందని సెన్సార్‌ వారు ప్రశసించారని, ప్రచార చిత్రాలకు కూడా అద్భుతమైన స్పందన లభిస్తున్నదని మేకర్స్‌ ఆనందం వ్యక్తం చేశారు. చెన్నై నగర నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా మనసుల్ని కదిలిస్తుందని దర్శకుడు తెలిపారు శ్రీగౌరిప్రియ, సిరి హన్మంతు, మహేందర్‌ తదితరులు నటించారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: సాయిరాజేష్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవి నంబూరి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events