Skip to main content

Namaste NRI

చెన్నై లవ్‌స్టోరీ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది : కిరణ్‌ అబ్బవరం

కిరణ్‌ అబ్బవరం , శ్రీగౌరీప్రియ జంటగా నటించిన యువతరం ప్రేమకథ చెన్నై లవ్‌స్టోరీ. రవి నంబూరి దర్శకుడు. సాయిరాజేశ్‌ కథ అందించడంతోపాటు ఎస్‌కేఎన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రచారంలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన ఈ సినిమా మ్యూజికల్‌ ఫెస్ట్‌లో కిరణ్‌ అబ్బవరం మాట్లాడారు. దర్శకుడు రవి నంబూరి రచనాశైలి నన్ను భావోద్వేగానికి లోనుచేసింది. నా జీవితాన్ని దగ్గరగా చూసి రాశాడా అనిపించింది. చెన్నైలవ్‌ స్టోరీ సినిమాలోని సంభాషణలు చాలా ఏళ్లు గుర్తుంటాయి. సాయిరాజేశ్‌ ఈ కథ చెప్పినప్పుడు హార్ట్‌ టచింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలో స్టీవెన్‌ రోల్‌ చేయడం పట్ల చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. గౌరీప్రియతో నటించడం గొప్ప అనుభవం. ఈ సినిమాతో ఆమెకు మంచి పేరొస్తుంది. ఇక ఈ రోజు రిలీజ్‌ చేసిన జిగితార సాంగ్‌కి ముందు లీడ్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. పాట కూడా అద్భుతంగా ఉంటుంది. తిరుపతిలో శ్రీవారి పాదాల సాక్షిగా చెబుతున్నా చెన్నై లవ్‌స్టోరీ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది అని నమ్మకంగా చెప్పారు.

డైరెక్టర్‌ రవి నంబూరి, కథానాయిక శ్రీగౌరీప్రియ, నిర్మాతలు ఎస్‌కేఎన్‌, సాయిరాజేశ్‌, చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మ, గీత రచయిత అనంతశ్రీరామ్‌, నిర్మాత ధీరజ్‌ మొగిలినేని కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిగితారా..జిగితారా… దిగినావా.. మనసారా అంటూ సాగే సినిమాలోని తొలి పాటను మేకర్స్‌ విడుదల చేశారు. కార్తీక్‌ ఈ పాటను ఆలపించారు. జూలై 24న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events