Namaste NRI

TTA, TANA ఆధ్వర్యంలో చికాగోలో చెస్ పోటీలు

TTA, TANA సంస్థలు సంయుక్తంగా చికాగోలో తమ వార్షిక చెస్ టోర్నమెంట్‌ను  నిర్వహించాయి. ఈ వినోద భరితమైన పోటీలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రజ్ఞాపాటవాల్ని ప్రదర్శించారు. పిల్లలలోని నిర్ణయాత్మక శక్తి, విశ్లేషణ నైపుణ్యం, ఏకాగ్రతని పెంచే చదరంగ పోటీలను TTA, TANA  ప్రతి సంవత్సరం  ఆనవాయితీగా నిర్వహించడాన్ని పిల్లల తల్లితండ్రులు అభినందించారు. TTA, ప్రెసిడెంట్ హేమచంద్ర వీరపల్లి ఆధ్వర్యంలో చెస్ పోటీలు విజయవంతంగా నిర్వహిం చారు. TTA సభ్యులు రవి వేమూరి, రామకృష్ణ కొర్రపోలు, ప్రసాద్ మరువాడ, దిలీప్ రాయపూడి, హేమంత్ పప్పు, మధు ఆరంబాకం ఆయనకు తోడ్పాటునందించారు. ఈ కార్యక్రమాంలో TANA ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ శశాంక్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొని విజేతలను ప్రశంసించారు. TTA, TANA మిడ్ వెస్ట్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ హను చెరుకూరి ఆధ్వర్యంలో  TANA లీడర్లు యుగంధర్ యడ్లపాటి, కృష్ణ మోహన్ చిలంకూరు, రవి కాకర, చిరంజీవి గల్లా, సందీప్ ఎల్లంపల్లి, హేమ కానూరు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events