Skip to main content

Namaste NRI

వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఆంద్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల కుమార్తె నిశ్చితార్థం ఘనంగా జరిగింది, ఈ సందర్భంగా వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా నిశ్చితార్థం ఫొటోలను పంచుకున్నారు, ఆమె మాట్లాడుతూ దేవుని దీవెనలతో, అమ్మ ప్రేమానురాగాలు, నాన్న YSR ఆశీస్సులతో, ఇరువురి కుటుంబాల సమక్షంలో, బంధుమిత్రులు, మరియు శ్రేయోభిలాషుల ఆశీర్వచనాలతో అంజిలి- రఘురామ్ నిశ్చితార్థ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది అన్నారు.

నిశ్చితార్థం వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి, అలాగే కుటుంబంతో కలిసి వచ్చి దీవెనలు అందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి, మంత్రులకు, పెద్దలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. రాలేకపోయినా మంచి మనసుతో నా బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఆత్మబంధువుకి వందనం అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబోయే వధూవరులు అంజిలి, సోమల రఘురామ్ రెడ్డిలఆశీర్వదించారు. ముఖ్యమంత్రి తో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు ప్రముఖులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events