Namaste NRI

అమెరికాలోని హార్వర్డ్ లో ‘ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్’ ను పూర్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్’ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిచేశారు. జనవరి 25 నుండి 30 వరకు జరిగిన ఈ ప్రోగ్రామ్ లో రేవంత్ రెడ్డి తో పాటు 62 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 21వ శతాబ్దంలో నాయకత్వం అనే అంశంపై ఈ ప్రోగ్రామ్ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహించారు. అమెరికా లో ప్రస్తుతం తీవ్రమైన చలి ఉంది, ఈ చలి లోనే ముఖ్యమంత్రి శిక్షణా కార్యక్రమం జరిగింది. ప్రోగ్రాం విజయవంతంగా పూర్తిఅయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు విద్యార్థులు అందరికీ ఫ్యాకల్టీ సభ్యులు సర్టిఫికెట్లు అందజేశారు అనంతరం గ్రూప్ ఫోటో దిగారు.

Social Share Spread Message

Latest News