అనన్య నాగళ్ల ప్రధాన భూమిక పోషించిన చిత్రం తంత్ర. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడు. నరేష్‌బాబు పి., రవి చైతన్య నిర్మాతలు. ధనుష్ రఘుముద్రి ఆమెకు జోడీగా నటించాడు. ఈ చిత్రంలో సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని ఇతర పాత్రలు పోషించారు. తమ సినిమాకి ఏ సర్టిఫికెట్ రావడంపై తంత్ర మూవీ టీమ్ స్పందించారు. మా సినిమాకు పిల్లలు రావద్దని హెచ్చరిస్తూ స్వయంగా చిత్రబృంద మే పోస్టర్‌ని విడు దల చేయడం విశేషం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నా యని, సినిమాపై అంచనాలు పెంచాయని చిత్రబృందం తెలిపింది. అతి త్వరలో ట్రైలర్‌ని, త్వరలో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిరామ్ ఉదయ్, విజయభాస్కర్ సద్దాల, సంగీతం: ఆర్.ఆర్.ధృవన్.