భారతీయ విద్యార్థులకు చైనా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో భారతీయ విద్యార్థులను మళ్లీ తమ దేశంలోకి అనుమతిస్తామని చైనా ప్రకటించింది. ఈ దిశగా వీసా జారీ ప్రక్రియ పున ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావ్ లిజియన్ ఈ మేరకు ఓ కీలక ప్రకటన చేశారు. భారతీయ విద్యార్థులకు చైనా ఎంతో ప్రాధాన్యమిస్తుందని అని కూడా వ్యాఖ్యానించారు. చైనా యూనివర్సిటీల్లో సుమారు 23 వేల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నట్లు ఓ అంచనా.














