కవ్వింపు చర్యలకు దూరంగా ఉండాల్సిందిగా చైనా మరోసారి అమెరికాను కోరింది. పారాసెల్ దీవుల చుట్టూ గల సముద్ర జలాల్లోకి అక్రమంగా అమెరికా నౌక ప్రవేశించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. దక్షిణ చైనా సముద్ర జలాలపై చైనా వాదనలకు వ్యతిరేకంగా హేగ్ న్యాయస్థానం రూలింగ్ ఇచ్చి ఐదేళ్లు గడిచిన రోజునే అమెరికన్ యుద్ధ నౌక ఆ జలాల్లోకి ప్రవేశించింది. చైనా అనుమతి లేకుండా పారాసెల్ దీవుల వద్ద గల జలాల్లోకి యుఎస్‌ఎస్ బెన్‌ఫోల్డ్ యుద్ధ నౌక ప్రవేశించిందని, దాన్ని తాము దూరంగా తరిమికొట్టామని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సదరన్ థియేటర్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.