Skip to main content

Namaste NRI

అమెరికా యుద్ద నౌకను తరిమికొట్టిన చైనా

కవ్వింపు చర్యలకు దూరంగా ఉండాల్సిందిగా చైనా మరోసారి అమెరికాను కోరింది. పారాసెల్‌ దీవుల చుట్టూ గల సముద్ర జలాల్లోకి అక్రమంగా అమెరికా నౌక ప్రవేశించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. దక్షిణ చైనా సముద్ర జలాలపై చైనా వాదనలకు వ్యతిరేకంగా హేగ్‌ న్యాయస్థానం రూలింగ్‌ ఇచ్చి ఐదేళ్లు గడిచిన రోజునే అమెరికన్‌ యుద్ధ నౌక ఆ జలాల్లోకి ప్రవేశించింది. చైనా అనుమతి లేకుండా పారాసెల్‌ దీవుల వద్ద గల జలాల్లోకి యుఎస్‌ఎస్‌ బెన్‌ఫోల్డ్‌ యుద్ధ నౌక ప్రవేశించిందని, దాన్ని తాము దూరంగా తరిమికొట్టామని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సదరన్‌ థియేటర్‌ కమాండ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Social Share Spread Message

Latest News