చైనా సంచలన ప్రకటన చేసింది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్యవర్తిత్వం వహించడానికి తాము సిద్దమని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ప్రకటించారు.విదేశాంగ శాఖ వార్షిక రిపోర్టును వెల్లడిరచే క్రమంలో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఏర్పడ్డ సంక్షోభానికి తెర దించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య బంధాలు చాలా బలంగా ఉన్నాయని అన్నారు. ఇరు దేశాలు పరస్పర సహకారం ఇచ్చి పుచ్చుకోవడానికి కూడా విశాలమైన అవకాశాలున్నాయన్నారు. అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేసుందుకు తాము సుముఖంగానే వున్నామని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య చర్చల విషయంలో గానీ, శాంతియుత వాతావరణం నెలకొనే విషయంలో గానీ నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి తాము సిద్దమని ప్రకటించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)