Namaste NRI

ట్రంప్‌ బెదిరింపులకు తలొగ్గని చైనా … అమెరికాపై బాదుడే బాదుడు

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాలూ పోటాపోటీగా ఒకరిపై ఒకరు సుంకాలు విధించుకుంటున్నాయి. డ్రాగన్‌పై అమెరికా 145 శాతం ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇక ట్రంప్‌ బెదిరింపులకు చైనా సైతం ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. అగ్రరాజ్యంపై ప్రతీకార సుంకాలతో దాడి చేస్తోంది. గతంలో అమెరికా దిగుమతులపై సుంకాలు 84 శాతానికి పెంచిన డ్రాగన్‌, ఇప్పుడు మరింత పెంచింది. అమెరికాపై 125 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది.

గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకాన్ని విధించింది. ఇటీవల పెంచిన పన్నుతో ఇది 54 శాతానికి చేరుకున్నది. దీనిపై డ్రాగన్‌ దీటుగా స్పందించింది. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. దీనిపై ఆగ్రహించిన ట్రంప్‌ టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గాలంటూ డ్రాగన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. మరో 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టారిఫ్‌లు 104 శాతానికి చేరాయి.అయినా చైనా వెనక్కి తగ్గలేదు. అమెరికాపై 84 శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. ట్రంప్‌ హెచ్చరిక లను చైనా పెడచెవిన పెట్టడంతో మళ్లీ అదనపు సుంకాల పోటు తప్పలేదు. చైనా నిర్ణయంతో ట్రంప్‌  మరో 21 శాతం బాదారు. దీంతో చైనాపై ప్రతీకార సుంకాలు 125 శాతానికి చేరింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events