పాకిస్థాన్‌కు చెందిన లష్కరే నేత షహీద్ మహమూద్ (42)ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితో భారత్, అమెరికా చేసిన సంయుక్త ప్రతిపాదనకు చైనా అడ్డుకోవడం గత నాలుగు నెలల్లో ఇది నాలుగోసారి. అబ్దుల్ రవూఫ్ ను ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని, అతని ఆస్దులను జప్తు చేయాలని, ప్రయాణ ఆంక్షలు విధించాలని అమెరికా, భారత్‌లు ముందుకు తెచ్చిన ప్రతిపాదనను భద్రత మండిలో శాశ్వత సభ్యదేశమైన చైనా అడ్డుకుంది. దీన్ని బట్టి ఇక్కడ చైనా తన స్నేహ దేశమైన పాకిస్తాన్‌కు మద్దతిస్తోందని, ఉగ్రవాదాలకు పాకిస్థాన్ ఎప్పుడూ ఆశ్రయం ఇస్తోందని స్పష్టం చేసింది. గతంలో చైనా, పాకిస్థాన్‌లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. పాక్‌లో తలదాచుకుంటున్న అబ్దుల్ రెహ్మాన్ మక్కీ తదితరులను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించాలన్న ఇరు దేశాల సంయుక్త ప్రతిపాదనలకు కూడా చైనా ఎప్పటికప్పుడు ఐరాసలో గండి కొడుతూ పాక్‌ను ఆదుకుంటూ వస్తోంది. భారత్, అమెరికాలపై దాడులే లష్కరే ప్రధాన లక్ష్యమని 2011 నుంచి పదేపదే చెబుతూ వస్తున్నాడని ఆమెరికా పేర్కొంది.