Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ యాక్షన్ కు.. చైనా స్ట్రాంగ్ రియాక్షన్

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధానికి చైనా నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10 శాతం సుంకం విధిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయగా, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్లపై 15 శాతం సుంకాలు విధిస్తున్నట్టు చైనా ప్రకటించింది. చమురు, వ్యవసాయ పరికరాలపై ఆ టారిఫ్ 10 శాతం ఉంటుందని స్పష్టం చేసింది. టంగ్స్టన్ సంబంధిత పదార్థాల ఎగుమతులపై నియంత్రణ విధించింది. పీవీహెచ్ కార్పొరేషన్, ఇల్యుమినా ఇంక్ వంటి అమెరికా సంస్థలను విశ్వసనీయత లేనివాటి జాబితాలో చేర్చింది.ఇదే కాకుండా అనైతిక వ్యాపార పద్ధతులు అవలంబిస్తున్న అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్ పైనా చైనా విచారణ జరపనుంది. ఈ రెండు పెద్ద దేశాలు ఒకదానిపై ఒకటి సుంకాలు విధించుకోవడంతో ట్రేడ్ వార్ భయాలు మొదలయ్యాయి.

Social Share Spread Message

Latest News