అమెరికాకు మరోమారు స్ట్రాగ్ వార్నింగ్ ఇచ్చింది డ్రాగన్ దేశం. అమెరికా చట్టసభ్యుడు మార్సా బ్లాక్‌బర్న్ తైవాన్‌లో పర్యటించడాన్ని తీవ్రంగా ఖండిరచింది. తైవాన్‌తో అన్నిరకాల అధికారిక పరస్పర చర్యలను ఆపాలని హెచ్చరించింది. రిపబ్లికన్ సెనేటర్ మార్షా బ్లాక్‌బర్న్ ఆగస్టు 25`27 వరకు తైపీ పర్యటన చేపట్టారు. ఈ పర్యటన ఒకే చైనా పాలసీ నిబంధనలను, అమెరికా`చైనా మధ్య మూడు ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. అలాగే తైవాన్‌తో అనధికారిక సంబంధాలు మాత్రమే కొనసాగిస్తామన్న అమెరికా అంగీకారానికి వ్యతిరేకంగా ఉంది.
ప్రపంచంలో చైనా ఒక్కటే ఉంది. చైనా భూభాగంలో తైవాన్ అంతర్భాగం. చైనా మొత్తానికి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వానికే అధికారం ఉంటుంది అని మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. తైవాన్ స్వాతంత్య్రం, వేర్పాటువాదం, విదేశీ శక్తుల జోక్యాన్ని వ్యతిరేకించటంలో వెనకడుగువేయబోమన్నారు. ఒకే చైనా పాలసీ, చైనా` అమెరికా ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని అమెరికా రాజకీయ నేతలకు విన్నవిస్తున్నామని తెలిపారు.