విదేశీ విద్యార్థుల విషయంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. AూజుAచీ (బ్రునె, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం) దేశాలకు చెందిన ఒంటరి విద్యార్థులకు చైనా వచ్చేందుకు అనుమతించబోతున్నట్లు ప్రకటించింది. అయితే భారత్కు చెందిన విద్యార్థుల విషయంలో మాత్రం డ్రాగన్ దేశం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కరోనా వైరస్ వలన వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదికి పైగా ఇంటికే పరిమితమైన విద్యార్థులు చదువును కొనసాగించడానికి తిరిగి చైనాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ దేశం మాత్రం విద్యార్థులకు అనుమతి నిరాకరిస్తూ వస్తోంది. తాజాగా AూజుAచీ దేశాలకు అనుమతిచ్చి భారత విద్యార్థులకు మొండిచేయి చూపింది.
గతేడాది నుంచే భారతీయులకు వీసాలు మంజూరు చేయడం నిలిపివేసింది. ఇరు దేశాల మధ్య విమానా సేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో 23 వేల మంది విద్యార్థులు ( వారిలో ఎక్కువగా మెడిసిన్ చదువుకునే విద్యార్థులే), వందల మంది వ్యాపారవేత్తలు చైనాకు తిరిగి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశీ విద్యార్థులను అనుమతించే అంశానికి చైనా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చైనా విదేశాంగ అధికారులు వెల్లడిరచారు. విద్యార్థులను దేశంలోకి అనుమతించే విషయంలో కరోనా భద్రత ప్రమాణాలు పాటిస్తుందని, సమన్వయ పద్ధతిలో అనుమతులకు ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.