Skip to main content

Namaste NRI

చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

అగ్రకథానాయకుడు చిరంజీవి, దర్శకుడు అనిల్‌ రావిపూడి కలయికలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ మన శంకర వర ప్రసాద్‌ గారు. హీరో వెంకటేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల తేదీని మేకర్స్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ ట్రైలర్‌ను ఈనెల 4న విడుదల చేయనున్నారు. ట్రైలర్‌ పోస్టర్‌లో చిరంజీవి హై ఓల్టేజ్‌ యాక్షన్‌ మోడ్‌లో ఉన్నారు. అనిల్‌ రావిపూడి ఇప్పటికే ఇది హై-వోల్టేజ్‌ మాస్‌ ఎలిమెంట్స్‌తో పాటు క్రైమ్‌ డ్రామా షేడ్స్‌ కలిగిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందని హింట్స్‌ ఇచ్చిన నేపథ్యంలో ట్రైలర్‌ కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, కేథరీన్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందకురానున్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News