స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సియం రేవంత్ రెడ్డి తో కలిసి ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవి జ్యురిక్ లో ఫ్యామిలీ ట్రిప్ లో ఉన్నారని తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సుకు రావాలని ఆహ్వానించారు. దీంతో చిరంజీవి సదస్సుకు హాజరయ్యారు. వేదికపై ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాకుమెంట్ ను వీక్షించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అభివృద్ధి విజన్ ను ఈ డాకుమెంట్ ప్రతిబింబించింది .


చిరంజీవితో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యామిలీ తో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చూశామని ఎంతో ఆస్వాదించామని అన్నారు. చిరంజీవి తన కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ విహారయాత్ర కు వెళ్లారు. ఈ సమయంలోనే ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరంజీవిని ఆహ్వానించారు.















