Skip to main content

Namaste NRI

గబ్బర్​సింగ్ నటుడు రమేశ్​కు చిరంజీవి ఆర్థిక సహాయం

గబ్బర్ సింగ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యాక్టర్‌ రమేశ్‌ తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. రమేశ్‌కు బెయిన్‌ స్ట్రోక్‌ రాగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా రమేశ్‌ కుటుంబానికి ఆర్థిక బాసటగా నిలిచేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చాడు. తక్షణ వైద్య సహాయం కోసం రమేశ్‌ భార్యకు రూ.౩ లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ మేరకు రమేశ్ భార్యకు చిరంజీవి చెక్కు అందజేశారు. అంతేకాదు రమేశ్‌ చికిత్సను అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వ భీమా పథకం వర్తించేలా సహకరిస్తామని చిరంజీవి హామీ కూడా ఇచ్చారు.

చిరంజీవి గతంలో కూడా ఆపదలో ఉన్న పేద కళాకారులకు, సినీ కార్మికులకు ఆర్థిక సాయం అందించాడని తెలిసిందే. మరోసారి గబ్బర్‌ సింగ్ రమేశ్‌కి నేనున్నానంటూ అండగా నిలబడటంతో మెగాస్టార్ గొప్ప మనసుకు అభిమానులు, మూవీ లవర్స్‌ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events