ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ను బ్రిటీష్ ప్రభుత్వం నైట్‌వుడ్‌తో సత్కరించనున్నది. ఈ ఏడాది నోలన్ తీసిన ఓపెన్‌హైమర్ చిత్రానికి ఆస్కార్ అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. క్రిస్టోఫర్ నోలన్ భార్య, ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఎమ్మా థామస్‌ను కూడా డేమ్‌వుడ్‌తో సత్కరించనున్నారు. ప్రభుత్వ పురస్కారాలు అందు కోనున్న వ్యక్తుల జాబితాను బ్రిటీష్ ప్రభుత్వం వెల్లడించింది. ఆ జాబితాను ప్రధాని రిషి సునాక్ ప్రతిపాదిం చారు. ఆ లిస్టులో కన్జర్వేటివ్ నేతలతో పాటు టెక్ పరిశ్రమ లీడర్లు కూడా ఉన్నారు. క్రిస్టోఫర్ నోలన్ కొత్తగా తీసిన ఓపెన్‌హైమర్ చిత్రానికి ఏడు అకాడమీ అవార్డులు దక్కాయి. బెస్ట్ పిక్చర్ ట్రోఫీతో పాటు బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా దక్కింది. ఇంటర్‌స్టెల్లార్, ఇన్‌సెప్షన్, డంకిర్క్, బ్యాట్‌మన్ సిరీస్‌ను నోలన్ తీశారు. ఓపెన్ హైమర్‌కు నోలన్ స్క్రీన్‌ప్లే రాశారు. థామస్‌తో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు.