చరణ్ లక్కరాజు, యశశ్రీ జంటగా నటిస్తున్న సినిమా ఛూ మంతర్. ఈ చిత్రాన్ని అద్వితీయ మూవీస్ పతాకంపై వెంకట్ కిరణ్‌కుమార్ కాళ్లకూరి నిర్మిస్తున్నారు. బి.కళ్యాణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో రూపాలక్ష్మీ, చిత్రం శ్రీను, యోగి కత్రి, జబర్దస్త్ కొమురం, గడ్డం నవీన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్ ఫిలింనగర్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎబిసిడి చిత్ర దర్శకుడు సంజీవ్‌రెడ్డి క్లాప్‌నివ్వగా నిర్మాత కిరణ్ తల్లి శ్రీలక్ష్మీ గారు కెమెరా స్విచాన్, ఉరి చిత్ర దర్శకుడు శ్రీనివాస్ తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత కిరణ్ కుమార్ మాట్లాడుతూ మా సంస్థలో ఇప్పటికే హాష్‌ట్యాగ్ కృష్ణారామ, గ్రే అనే సినిమాలు నిర్మించాం. మా ప్రొడక్షన్‌లో మూడో చిత్రమిది. సరికొత్త కాన్సెప్ట్‌తో నిర్మిస్తున్నాం. నేటి నుంచే రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెడతాం అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మధుసూదన్ కోట, సంగీతం : సుధా శ్రీనివాస్.

















