Namaste NRI

ఊరు పేరు భైరవకోన..న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్

సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన.  కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు.  వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఫాంటసీ అడ్వెంచర్‌ మూవీగా తెరకెక్కించారు. రాజేష్‌ దండా నిర్మాత. తొలుత ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే  తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 16న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సూపర్‌ నేచురల్‌ అంశాలతో సాగే ఫాంటసీ చిత్రమిదని, కాల్పనిక ప్రపంచం భైరవకోనలో జరిగే సంఘటనలు ఆద్యంతం ఉత్కంఠను, ఉద్వేగాన్ని పంచుతాయని చిత్రబృందం తెలిపింది. గ్రాఫిక్స్‌కు కథలో కీలకంగా ఉంటాయని పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌ తోట, సంగీతం: శేఖర్‌చంద్ర, సమర్పణ: అనిల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీఐ ఆనంద్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events