Namaste NRI

విక్రమ్ తంగలాన్ విడుదలపై క్లారిటీ

విక్రమ్ హీరోగా నటిస్తున్న చిత్రం తంగలాన్. పా రంజిత్ దర్శకత్వం.  ఈ చిత్రంలో మాళవికా మోహనన్‌, పార్వతి తిరువొత్తు ఫీ మేల్‌ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, పశుపతి, డానియెల్‌ కల్టగిరోన్‌ కీ రోల్స్‌ పోషిస్తున్నారు. అడ్వెంచరస్‌ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన తంగలాన్‌ గ్లింప్స్‌ వీడియోతోపాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తున్నాయి. ముందుగా ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలని నిర్ణయించగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డది.

2024 వేసవిలో తంగలాన్ థియేటర్లలో సందడి చేయబోతుందని ఇటీవలే వార్తలు రాగా,  దీనిపై అధికారిక అప్‌డేట్‌ అందించారు మేకర్స్‌. ఏప్రిల్‌లో తంగలాన్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్‌. తేదీపై మాత్రం సస్పెన్స్‌ పెట్టారు. ఇటీవలే బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథ అంటూవిక్రమ్‌ తన సైన్యంతో సమరాన్ని వెళ్తున్న నయా లుక్‌ గూస్‌బంప్స్‌ తెప్సిస్తోంది. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events