Namaste NRI

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ

ఆంధ్రప్రదేశ్‌పై బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా కోస్తాంధ్రపై బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయి. తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షం కురుస్తునే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో పలు గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. బాధిత కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. హై అలర్ట్‌లో ఉన్న అధికారులు తుఫాను ప్రభావాన్ని పర్యవేక్షిస్తున్నారు.

కాగా, సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. బాపట్ల, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, నర్సాపురం ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా నష్టాన్ని అంచనా వేశారు. అక్కడి నుంచి నేరుగా అమలాపురం వెళ్లి పంట దెబ్బతిన్న రైతులను, నష్టపోయిన బాధితులను పరామర్శించారు.

Social Share Spread Message

Latest News