2021 సెప్టెంబర్ 2న దేశ రాజధాని ఢల్లీి నడిబొడ్డున టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం భవనానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేయడం గొప్ప విషయమని ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. 2001 ఏప్రిల్ 27న గుప్పెడు మందితో తెలంగాణ నడిబొడ్డున జల దృశ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ ఊపిరి పోసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది ఒక్క టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి అని మహేష్ బిగాల ఆకాంక్షించారు.