Namaste NRI

సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

తెలంగాణ  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉదయం  స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కడుపులో కొంచెం నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కేసీఆర్‌కు  కావాల్సిన అన్ని వైద్య పరీక్షలు చేయించారు. సీటీ స్కాన్, ఎండోస్కోపీ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ పరీక్షల్లో సీఎంకు కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్లుగా తేలింది. మందులతో ఆ అల్సర్ తగ్గిపోతుందని వైద్యులు తెలిపారు. అల్సర్ మినహా మిగతా అన్ని పారామీటర్స్ నార్మల్‌గా  ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. దాంతో అల్సర్ తగ్గడానికి అవసరమైన మెడికేషన్‌ను  ప్రారంభించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events