ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి ఆధ్వర్యంలో సిడ్నీ, అడిలైడ్, మెల్బోర్న్, కాన్‌బెర్రా, బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్ , బెండీగో, బల్లారాట్ నగరాల్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. వినయ్ సన్నీగౌడ్ ఆధ్వర్యంలో మెల్బోర్న్‌లో నిర్వహించిన వేడుకల్లో కాసర్ల నాగేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదగాలని ఆకాంక్షించారు. సాయికృష్ణ కల్వకుంట్ల ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర మంత్రిపడగ, సతీశ్ పులిపాక, సంతోష్, వెంకటేష్ తిరువీధుల తదితరులు పాల్గొన్నారు.














