కువైట్ దేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్, జాగృతి ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు. ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల , కువైట్ జాగృతి అధ్యక్షులు వినయ్ ముత్యాల నాయకత్వంలో కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మాదిరి దేశం కూడా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని వారు వెల్లడించారు. కేసీఆర్‌ను ప్రధాన మంత్రిగా చూడాలని బీఆర్ఎస్ కువైట్ తరుఫున కోరుకుంటున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సభ్యులు ప్రవీణ్, అయ్యప్ప, సురేశ్ గౌడ్, ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.