యూకేలోని లండన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ కోశాధికారి జీ సతీష్ రెడ్డి గొట్టెముక్కుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి దాదాపు 150 మందికిపైగా ఎన్నారై బీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఇతర ప్రవాస కుటుంబసభ్యులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌కు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని, దేశాన్ని నడిపించే శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపారని, ఇలాంటి నాయకుడు మనకు ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నేడు దేశమంతా అనుసరిస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. గత 12 ఏండ్లుగా లండన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఇప్పుడు ప్రపంచమంతా వేడుకలు జరుగుతున్నాయన్నారు.
సర్వమత ప్రార్థనలు చేసి ముఖ్యమంత్రిని ఆశీర్వదించిన అన్ని మతాల ప్రతినిధులకు ఎన్నారై బీఆర్ఎస్ యూకే ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల కృతజ్ఞతలు తెలిపారు. తాము వేడుకలకే పరిమితం కాలేదని, రాష్ట్రంలో పలు సేవా కార్యక్రామాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అన్ని మతాల ప్రజల ఆశీస్సులు కేసీఆర్‌కు ఉన్నాయని, రాష్ట్రంలో ముస్లింలు అన్ని రకాలుగా అభివృద్ధి చెంది సంతోషంగా ఉన్నారని అబుజాఫర్ అన్నారు. ఖండాంతరాల్లో ఉంటూ బీఆర్‌ఎస్ జెండా మోసే అవకాశం కలిపించిన సీఎం కేసీఆర్‌కు అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని, సందర్భం ఏదైనా ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, కార్యదర్శి హరి గౌడ్ నవాబుపేట్, కోశాధికారి సతీష్ గొట్టెముక్కుల, అధికార ప్రతినిధి రవిప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి, ఎన్నారై బీఆర్‌ఎస్ నాయకులు మల్లారెడ్డి, వీర ప్రవీణ్ కుమార్, గణేష్ పస్తం, సతీష్ రెడ్డి బండా, గణేష్ కుప్పలా, ప్రశాంత్ మామిడాల, సురేష్ బుడగం, ప్రవాస సంఘాల నాయకులు శుష్మునా రెడ్డి, స్వాతి బుడగం, ప్రవళిక భువనగిరి, స్నేహ, నందిని తదితరులు పాల్గొన్నారు.