Namaste NRI

సీఎం పెళ్లాం మూవీ షూటింగ్‌ షురూ

సుమన్‌, ఇంద్రజ, అజయ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం సీఎం పెళ్లాం ( కామన్‌ మ్యాన్‌ పెళ్లాం). రమణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు.  చిత్ర సమర్పకుడు వాకాడ అప్పారావు. ఈ  చిత్రం షూటింగ్‌  హైదరాబాద్‌లో మొదలైంది.  దర్శకుడు మాట్లాడుతూ  పదేళ్ల తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి అనేది భిన్నమైన కోణంలో చెబుతున్నాం. డిఫరెంట్‌ యాంగిల్‌లో రాజకీయ అంశాలు చర్చిస్తున్నాం  అని చెప్పారు. వాకాడ అప్పారావు మాట్లాడుతూ  ఏ రాజకీయ పార్టీకీ సంబంధం లేకుండా తయారువుతున్న ఓ భార్య కథ ఇది. సమాజానికి రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు ఎలా ఉపయోగపడాలో చెప్పే సినిమా అన్నారు.  ఒక కామన్‌ మ్యాన్‌కి రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులను చూపించే సినిమా ఇదని నిర్మాత బొల్లా రామకృష్ణ చెప్పారు. నగేష్‌, కోటేశ్వర రావు, భరత్‌, ప్రీతి నిగం, దాసరి చలపతి రావు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ప్రిన్స్‌ హనీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events