Skip to main content

Namaste NRI

గూగుల్‌ హెడ్‌ ఆఫీస్‌కి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయన్ని సందర్శించారు. తెలంగాణలో టెక్ సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టుల్లో భాగం పంచుకునే విషయమై గూగుల్ సంస్థ ఉన్నతాధికారులతో తెలంగాణ బృందం చర్చలు జరిపింది. చ‌ర్చ‌లు సానుకూలంగా జ‌రిగిన‌ట్లు రేవంత్ వెల్ల‌డించారు. ముఖ్యమంత్రి వెంట పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

Social Share Spread Message

Latest News