విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అమెరికన్ కార్నర్ ఏర్పాటైంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్‌గా అమెరికన్ కార్నర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏయూలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు కావటం సంతోషకరమని అన్నారు. దేశంలో అహ్మదాబాద్, హైదరాబాద్ తర్వాత విశాఖపట్నంలోనే అమెరికన్ కార్నర్ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇదెంతో మేలు చేస్తుందని తెలిపారు. యూఎస్ విద్య, ఉద్యోగాంశాల్లో సమాచారం కోసం అమెరికా కార్నర్ సాయపడనుంది. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మెన్, మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి, యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.