అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచలనం సృష్టించింది. యూఎస్ ఓపెన్ ఫైనల్‍లో బెలారస్‍కు చెందిన ప్రపంచ రెండో సీడ్ అరీనా సబలెంకా ను ఓడించి 19 ఏళ్లకే తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‍ను కైవసం చేసుకుంది. సుమారు 2 గంటల 6 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‍లో అరీనా సబలెంకాను 2-6, 6-3, 6-2 పాయింట్ల తేడాతో చిత్తు చేసింది.
