సుహాస్, చాందినీ చౌదరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం కలర్‌ఫొటో. సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. కరోనా సంక్షోభం కారణంగా ఈ చిత్రాన్ని తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూడాలనుకుని మిస్సయిన సినీ లవర్స్ కు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. తాజాగా చిత్ర నిర్మాత సాయిరాజేశ్, సందీప్ రాజ్ కలర్ ఫొటో థ్రియాట్రికల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. నవంబర్ 19న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ట్విటర్ ద్వారా తెలియజేశారు. సందీప్ రాజ్ కథనందిస్తూ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్‌టైన్ మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. హర్ష చెముడు, శ్రీదివ్య, సునీల్ ఇతరీ కలక పాత్రలు పోషించారు. కాలభైరవ కంపోజ్ చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. కలర్‌ఫొటో సినిమా మూవీ లవర్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ తెలుగు సినిమా కేటగిరీలో నేషనల్ అవార్డు కూడా అందుకుంది కలర్ ఫొటో.