
ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే పిల్లలకు వ్యాక్సినేషన్ విషయంలో భారత్ చాలా వెనుకబడి ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో, యూనిసెఫ్ తాజా నివేదిక వెల్లడించింది. రెండు నెలల వయసులో ఇచ్చే డీటీపీ(డిప్తీరియా, టెటానస్, పెర్టుసిస్) మొదటి డోస్ మిస్ అయిన చిన్నారుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 2022లో దాదాపు 1.39 కోట్ల మంది ఉండగా, 2023కు ఆ సంఖ్య 1.45 లక్షలకు పెరిగిందని తెలిపింది.
