రష్యాలో నాటకీయ పరిణామాల మధ్య తిరుగుబాటు సంక్షోభం ముగిసింది.బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో రాయబారంతో రష్యా సైన్యం, వాగ్నర్ గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ప్రకటించిన నేపథ్యంలో రంగంలోకి దిగిన బెలారస్ అధ్యక్షుడు, వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రగోజిన్తో చర్చలు జరిపారు. ఉద్రిక్తతను సడలించడానికి బలగాలను నిలువరించాలని లుకషెంకో విజ్ఞప్తి చేశారు. ఇరివురి మధ్య జరిగిన చర్చల అనంతరం రష్యా సైన్యం, వాగ్నర్ గ్రూప్ మధ్య రాజీ ఒప్పందం కుదిరింది. దీంతో ఉక్రెయిన్లోని శిబిరాలకు తిరిగి వెళ్లిపోవాలని ప్రిగోజన్ తన సైన్యాన్ని ఆదేశించారు. మరోవైపు, రాజీ ఒప్పందం అనంతరం వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్పై క్రిమినల్ కేసు ఎత్తివేస్తామని క్రెమ్లిన్ ప్రకటించారు.