Namaste NRI

శాస్త్రవేత్తల ఆందోళన.. మేఘాల్లోకీ

భూమిని మొత్తం ఆక్రమించేసిన మైక్రోప్లాస్టిక్స్‌ మేఘాల్లోకీ చేరాయని, ఇవి పర్యావరణాన్ని సైతం ప్రభావితం చేస్తుండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అమెరికాలోని పెన్సిల్వేని యా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆకాశంలో మైక్రోప్లాస్టిక్‌లు మంచు కేంద్రక రేణువులుగా పనిచేసి అసహజంగా మేఘాల ఏర్పాటుకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

సాధారణంగా మేఘాలు ఏర్పడే పరిస్థితులు లేకపోయినా మైక్రోప్లాస్టిక్‌లు మేఘాలు ఏర్పడేలా చేస్తాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిర్ధారించడం కోసం పరిశోధకులు నాలుగు రకాల మైక్రోప్లాస్టిక్‌లను ప్రయోగ శాలలో పరీక్షించారు. ఇందుకోసం నీటి బిందువులను చల్లబరిచి మంచుగా మార్చారు. మైక్రోప్లాస్టిక్‌ లేని నీటి బిందువులు మైనస్‌ 38 డిగ్రీల సెల్సియస్‌ వద్ద గడ్డ కట్టగా, 50 శాతం మైక్రో ప్లాస్టిక్‌లతో కలుషితమైన నీటి బిందువులు మైనస్‌ 22 డిగ్రీల సెల్సియస్‌ వద్దనే గడ్డ కడుతున్నట్టు తెలుసుకున్నారు. కాబట్టి మైక్రో ప్లాస్టిక్‌లు మేఘాల నిర్మాణాన్ని ప్రభావితం చేస్తున్నాయని అర్ధమవుతున్నదని శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఫ్రీడ్‌మన్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events