Namaste NRI

షరతులు వర్తిస్తాయి.. ట్రైలర్ రిలీజ్

చైతన్యరావు, భూమిశెట్టి జంటగా రూపొందిన చిత్రం షరతులు వర్తిస్తాయి. కుమారస్వామి(అక్షర) దర్శకుడు. నాగార్జున సామల, శ్రీష్‌కుమార్‌ గుండా, డాక్టర్‌ కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మాతలు. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. నిర్మాతలుగా పరిశ్రమలో ఎక్కువకాలం కొనసాగాలనేది మా ఆకాంక్ష. అందుకు తొలి అడుగే ఈ సినిమా. ఏషియన్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు మా సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాయి. అందరికీ నచ్చే సినిమా అవుతుందని నమ్మకంతో ఉన్నాం అని నిర్మాత లు అన్నారు. చక్కటి కథతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఈ సినిమాలో ఉంటాయని, కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇదని, అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, అండగా నిలిచిన మామిడి హరికృష్ణకి కృతజ్ఞతలని దర్శకుడు చెప్పారు. ఇంకా చైతన్యరావు, భూమి శెట్టి, నటుడు సంతోష్‌ యాదవ్‌ కూడా మాట్లాడారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events