ఈ నెల 23న 14వ బ్రిక్ దేశాల సదస్సు వర్చువల్గా జరగనుంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాల (బ్రిక్స్)లతో కూడిన బ్రిక్స్ సదస్సు ఈ ఏడాది చైనా ఆధ్వర్యంలో జరుగుతుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు రామఫోసా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. జూన్ 24న అంతర్జాతీయ అభివృద్ధిపై విస్తృత సమావేశం నిర్వహిస్తారు. రొటేన్ పద్దతిపై ఈ ఏడాది సదస్సు జరుగుతుంది. ప్రపంచాభివృద్ధిలో కొత్త శకం తదితరాల్లో బ్రిక్ దేశాల భాగస్వామ్యంపై చర్చిస్తాయని చైనా విదేశాంగ శాఖ వెల్లడిరచింది.