కాబూల్ విమానాశ్రయం పై రానున్న 24`36 గంటల్లోగా మరో దాడి జరిగే అవకాశం చాలా ఎక్కువగా వుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. జాతీయ భద్రతా బృందంతో బైడెన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ ఐసిస్`కే ఉగ్రవాదులు లక్ష్యంగా జరిగిన డ్రోన్ల దాడి అఖరిది కాదని బైడెన్ వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూపుపై వైమానిక దాడులు కొనసాగుతాయని బైడెన్ ప్రకటించారు. విమానాశ్రయ పరిసరాల్లో ఎవరూ ఉండవద్దని అఫ్గాన్‌లోని అమెరికా సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. నిర్దిష్టమైన, విశ్వసనీయమైన ముప్పు వుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ మేరకు కొత్తగా సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది. బలగాల తరలింపునకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రసుత్తం కాబూల్ విమానాశ్రయంలో నాలుగువేల మంది కన్నా తక్కువగానే అమెరికా బలగాలు వున్నాయని ప్రకటించింది. అఫ్గాన్‌లో ఉన్న అమెరికా సైనికుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.