Namaste NRI

దోషి ఫస్ట్‌లుక్‌ విడుదల

విజయ్‌ ఆంటోనీ హీరోగా నటిస్తున్న చిత్రం దోషి. మహిమా నంబియార్‌, నందితా శ్వేత, రమ్య నంబీసన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. క్రైమ్‌ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఇప్పటిదాకా మానవాళి చరిత్రలో జరగని క్రైమ్‌ డ్రామా కథగా ఈ  సినిమా ఉండనుంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్స్‌ పతాకంపై కమల్‌ బోరా, జి.ధనుంజయన్‌, బి. ప్రదీప్‌, పంకజ్‌ బోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సీఎస్‌ అముదన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. జగన్‌, నిళల్‌ గల్‌ రవి, జాన్‌ మహేంద్రన్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కన్నన్‌ అందిస్తున్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events