2024లో అమెరికా అధ్యక్ష పదవి జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రముఖ రాపర్ కాన్యే వెస్ట్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్తిగా ఉండాలని అన్నారు. కాన్వే వెస్ట్ ర్యాపర్‌గా అమెరికా ప్రజానీకానికి పరిచితుడు. ఎందరో ఆయనకు అభిమానులుగా ఉన్నారు. కాన్వే ఇంతకు ముందు 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆలస్యంగా తన పార్టీని నమోదు చేయడం వల్లనే కాన్యే గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడని తెలిసింది. గత ఎన్నికల ప్రచారం అంతటా ఒకే ఒక్క ప్రధాన పాత్రలో కాన్వే కనిపించాడు. అమెరికా ఓటర్లను అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
