రవిశంకర్ ప్రధాన పాత్రలో నిఖిల్, రాజశేఖర్, తేజ హీరోలుగా నటిస్తున్న చిత్రం కాప్. బి.సోమసుందరం దర్శకత్వం వహిస్తున్నారు. హరీష్‌రాయ్, క్రేన్ మనోహర్, జయచంద్ర, సోనీ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ వాణిజ్య అంశాలు కలబోసిన పొలిటికల్ సెటైర్ మూవీ ఇది. సమాజానికి ఉపయుక్తమయ్యే చక్కటి సందేశం ఉంటుంది. కథలో కొత్తదనం ఆకట్టుకుంటుంది అన్నారు. యువతరానికి బాగా కనెక్ట్ అయ్యే కథాంశమిదని హీరోలు నిఖిల్, రాజశేఖర్ పేర్కొన్నారు. ముప్పై రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశామని నిర్మాత మాధవన్ సురేష్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అల్లికట్టి, సంగీతం: మిలన్ జోషి, నిర్మాత: మాధవన్ సురేష్, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.సోమసుందరం.