Namaste NRI

అగ్రరాజ్యంలో మళ్లీ కరోనా విజృంభణ … వారంలో 8వేలకు పైగా

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పలుచోట్ల కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో బాధితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నిర్వరామంగా శ్రమించాల్సి వస్తోంది. అమెరికాలో ఇప్పటికే కరోనా డెల్టా రకం ఉద్ధృతి తీవ్రంగా ఉండగా అత్యధిక సంక్రమణ శక్తితో వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయపెడుతోంది. గత వారం రోజుల్లో 8.5 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 8 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.    గత గత 7 రోజుల్లో 60 వేల మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేరారు. నవంబరు ప్రారంభం కంటే 50 శాతం ఎక్కువని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

                న్యూయార్క్‌లో దాదాపు 20 వేల మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఒహివోలో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నెబ్రెస్కాలో ఆసుపత్రులకు కొవిడ్‌ రోగుల తాడికి పెరుగుతుండటంతో ఇతర వ్యాధులతో వస్తున్న వారందరినీ చేర్చుకోలేని పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు. కాన్సాస్‌, మిస్సోరీల్లో శస్త్ర చికిత్సలను వాయిదా వేస్తున్నారు. అమెరికాలో 61 శాతం  జనాభాకు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే టీకా పొందనివారే అధికంగా కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events